భవనాల పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-09-13T06:50:48+05:30 IST

ఏజెన్సీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ, హెల్త్‌ వెల్‌నెస్‌, రైతు భరోసా కేంద్రాల భవనాలు సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.

భవనాల పనులను పూర్తి చేయాలి

రంపచోడవరం, సెప్టెంబరు 12: ఏజెన్సీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ, హెల్త్‌ వెల్‌నెస్‌, రైతు భరోసా కేంద్రాల భవనాలు సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల ఇంజనీర్లు, అధికారులతో భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ భవన నిర్మాణాలలో సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.డేవిడ్‌రాజ్‌, డీఈ గౌతమి, ఉపాధి పథకం ఏపీడీలు కె.చిట్టిబాబు, భాగ్యారావు, ఏఈలు సత్యనారాయణ, నాగరాజు, పి.వెంకటరమణ, వంశీకృష్ణ, ఏపీవో సాయిబాబా పాల్గొన్నారు.

Read more