కొత్త బ్రిడ్జి నిర్మించాలి

ABN , First Publish Date - 2022-09-21T05:36:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సమిశ్రగూడెం గడ్డర్‌ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం నాయకుడు జువ్వల రాం బాబు అన్నారు.

కొత్త బ్రిడ్జి నిర్మించాలి

నిడదవోలు, సెప్టెంబరు 20: రాష్ట్ర ప్రభుత్వం సమిశ్రగూడెం గడ్డర్‌ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం నాయకుడు జువ్వల రాం బాబు అన్నారు. మంగళవారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం గడ్డర్‌ బ్రిడ్జి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పురాతన గడ్డర్‌ బ్రిడ్జిని పరిరక్షించేందుకు భారీ వాహనాల రాకపో కలను నియంత్రించే దిశగా గడ్డర్‌లను ఏర్పాటు చేశారని, దీంతో బయట ప్రాం తాల నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, లారీలు రాకపోకలు నిలిచిపోవడంతో పట్ట ణంలో అభివృద్ధి కుంటుపడిందని రాంబాబు అన్నారు. గడ్డర్‌ బ్రిడ్జి బలహీనంగా ఉన్నందున గడ్డర్‌లు ఏర్పాటు చేయడం మంచిదే అయినా పట్టణంలో వ్యాపా రాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత జనాభాను, వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని నూతన బ్రిడ్జి నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more