ఏలేరు కాలువలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-03-16T06:22:39+05:30 IST

మండలంలోని ముక్కోలు గ్రామంలో గల ఏలేరు బెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కాలువలో జారి పడి యువకుడు మృతి చెందినట్లు కిర్లంపూడి ఎస్‌ఐ బి.తిరుపతిరావు తెలిపారు.

ఏలేరు కాలువలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి

కిర్లంపూడి, మార్చి 15: మండలంలోని ముక్కోలు గ్రామంలో గల ఏలేరు బెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కాలువలో జారి పడి యువకుడు మృతి చెందినట్లు కిర్లంపూడి ఎస్‌ఐ బి.తిరుపతిరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివిలి గ్రామంలో కిట్స్‌ కాలేజ్‌లో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతున్న పిల్ల కిశోర్‌కుమార్‌ (20)తో పాటు ఆరుగురు స్నేహితులు ముక్కొళ్లు గ్రామంలో గల ఏలేరు కాలువ వద్దకు వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లారు. కల్వర్టుపై గల గోడపై నడుస్తుండగా కిశోర్‌కుమార్‌ జారిపడి కాలువలో పడిపోయాడు. తన తోటి స్నేహితులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో కిశోర్‌ బంధువైన సేకా చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతిరావు తెలిపారు.

Read more