దైవ సేవకులు ఉన్నతమైనవారు: బ్రదర్‌ అనిల్‌

ABN , First Publish Date - 2022-04-10T06:01:30+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 9: సమాజంలో సేవలు చేసే దైవసేవకులు ఉన్నతమైనవారని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. అక్టోబరులో జరిగే సీవైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సిల్వర్‌ జూబ్లీ మహోత్సవాల్లో భాగంగా నాగమల్లితోట జంక్షన్‌వద్ద ఉన్న ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మెగా పాస్టర్స్‌ అండ్‌ లీడర్స్‌ మీట్‌ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కాకినాడ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన తర్వాత మొదటిసారి సీవైఎఫ్‌ అంత

దైవ సేవకులు ఉన్నతమైనవారు: బ్రదర్‌ అనిల్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 9: సమాజంలో సేవలు చేసే దైవసేవకులు ఉన్నతమైనవారని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. అక్టోబరులో జరిగే సీవైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సిల్వర్‌ జూబ్లీ మహోత్సవాల్లో భాగంగా నాగమల్లితోట జంక్షన్‌వద్ద ఉన్న ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మెగా పాస్టర్స్‌ అండ్‌ లీడర్స్‌ మీట్‌ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కాకినాడ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన తర్వాత మొదటిసారి సీవైఎఫ్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు మూర్తిరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పాస్టర్‌ అండ్‌ లీడర్స్‌మీట్‌లో అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మేయర్‌ సుంక ర శివప్రసన్న, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నేతలు అల్లు రాజుబాబు, సుజాత, సీవైఎఫ్‌ కోశాధికారి బీహెచ్‌ ఉషారాణి పాల్గొన్నారు.

Read more