బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పిడపర్తి మృతి

ABN , First Publish Date - 2022-01-23T06:51:29+05:30 IST

మండపేట బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మండల మాజీ విద్యాశాఖ అధికారి పిడపర్తి భీమ శంకర్‌శాస్ర్తి(71) శనివారం తర్వాణి పేటలోని ఆయన స్వగృహంలో ఆకస్మికంగా మృతి చెందారు.

బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పిడపర్తి మృతి

మండపేట, జనవరి 22: మండపేట బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మండల మాజీ విద్యాశాఖ అధికారి పిడపర్తి భీమ శంకర్‌శాస్ర్తి(71) శనివారం తర్వాణి పేటలోని ఆయన స్వగృహంలో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య నాగమణి, నలుగురు కుమారులు ఉన్నారు. ఎందరో విద్యార్థుల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగించిన ఆయన ప్రతిఏటా తన సొంత నిధులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థు లకు స్కాలర్‌షిప్‌ అందజేసేవారు. పేద విద్యార్థులకు ఫీజులు తానే చెల్లించేవారు. ఉపాఽ ద్యాయులకు ఆదర్శంగా నిలిచిన పిడపర్తికి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జునచౌదరి, రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టభిరామయ్యచౌదరి, నల్లమిల్లి వీర్రెడ్డి, జి.విజయ భాస్కర్‌రెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు అవస రాల వీర్రాజు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం, ఏడిద సూర్యనారాయణ ఉన్నారు.Read more