-
-
Home » Andhra Pradesh » East Godavari » bjp leaders raily-NGTS-AndhraPradesh
-
బీజేపీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన
ABN , First Publish Date - 2022-08-15T06:43:33+05:30 IST
దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన లక్షలాది సోదరి, సోదరీమణులను స్మరించుకుంటూ బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్ర ఆధ్యర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు.

రామచంద్రపురం, ఆగస్టు 14: దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన లక్షలాది సోదరి, సోదరీమణులను స్మరించుకుంటూ బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్ర ఆధ్యర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి శివాలయం వీధిలోని శ్రీనేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. యాండ్ర బుల్లబ్బులు, ఆకేటి కృష్ణ, పలివెల రాజు, సత్యవాడ శ్రీహరి పంతులు, కొట్టువాడ హరిబాబు, సలాది సతీష్‌నాయుడు, కృష్ణమూర్తి, సుందర్‌సింగ్, పెన్నాడ శ్రీనివాస్, ఖండవిల్లి సత్యన్నారాయణ, అల్లం రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు.