వైసీపీ చేస్తున్నది అవినీతి వికేంద్రీకరణ

ABN , First Publish Date - 2022-09-19T06:16:09+05:30 IST

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది అవినీతి వికేంద్రీకరణ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, కేరళ బీజేపీ పార్టీ ఇన్‌ఛార్జి సత్యకుమార్‌ విమర్శించారు.

వైసీపీ చేస్తున్నది అవినీతి వికేంద్రీకరణ
విలేకరులతో మాట్లాడుతున్న సత్యకుమార్‌

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌


రాజమహేంద్రవరం అర్బన్‌/దివాన్‌చెరువు, సెప్టెంబరు 18 :  అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది అవినీతి వికేంద్రీకరణ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, కేరళ బీజేపీ పార్టీ ఇన్‌ఛార్జి సత్యకుమార్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో మాట్లాడే హక్కు ముఖ్యమంత్రి జగన్‌కు కానీ, ఆయన మంత్రులకు కానీ లేదన్నారు. అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఇప్పుడు ఏదేదో చెప్పి ప్రజలను రెచ్చగొడుతున్నారు.రాజమహేంద్రవరంలో 1,052 కోట్లతో 19,578 గృహాలు మంజూరు చేస్తే ఇప్పటి వరకూ నిర్మించింది 11 వేలు మాత్రమే అన్నారు.  ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీ వరకూ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో 286 సెంటర్లలో సభలు పెడతామన్నారు. రాజానగరం మండల బీజేపీ అధ్యక్షుడు పేపకా యల కాశీ అధ్యక్షతన ఆది వారం పుణ్యక్షేత్రం గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పఽథకానికి కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 90 శాతం నిధులు ఇస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్య క్షుడు పరిమి రాధాకృష్ణ, సత్యగోపీనాఽథ్‌దాస్‌,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి,నాయకులు ఏ.పి.ఆర్‌.చౌదరి, బొమ్ముల సతీష్‌, అడబాల గణపతిరావు, మోది సత్తి బాబు,మానుగర్ర మల్లిఖార్జునరావు, బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-19T06:16:09+05:30 IST