ఏ తల్లి కన్నబిడ్డో..

ABN , First Publish Date - 2022-09-27T06:58:15+05:30 IST

చాగల్లు, సెప్టెంబరు 26: ఏ తల్లి కన్నబిడ్డోకాని అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలోని తాగునీటి ట్యాంకు సమీపంలో సోమవారం సాయంత్రం పొదల్లోంచి ఓ పసికందు ఏడుపు బిగ్గరగా వినిపించింది. దీన్ని గమనించిన డి వెంకటేశ్వరరావు, కొందరు స్థానికులు సమీపంలోని సచివాలయానికి సమాచారం అందించారు. నిడదవోలు ఐసీడీఎస్‌ సీడీపీవో ఎం ఆషారోహిణి

ఏ తల్లి కన్నబిడ్డో..

ఊనగట్ల గ్రామంలోని పొదల్లో పసికందు.. రక్షించిన స్థానికులు

చాగల్లు, సెప్టెంబరు 26: ఏ తల్లి కన్నబిడ్డోకాని అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలోని తాగునీటి ట్యాంకు సమీపంలో సోమవారం సాయంత్రం పొదల్లోంచి ఓ పసికందు ఏడుపు బిగ్గరగా వినిపించింది. దీన్ని గమనించిన డి వెంకటేశ్వరరావు, కొందరు స్థానికులు సమీపంలోని సచివాలయానికి సమాచారం అందించారు. నిడదవోలు ఐసీడీఎస్‌ సీడీపీవో ఎం ఆషారోహిణి సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికుల సహాయంతో శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, డాక్టర్‌ ఇందురేఖ, స్టాఫ్‌నర్సు ఎంఎల్‌ ప్రదీప ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు. బిడ్డ తల్లిదండ్రుల కోసం అధికారులు గాలిస్తున్నారు. సూపర్‌వైజర్‌ వరలక్ష్మి, నళిని, అంగ న్‌వాడీ టీచర్‌ కృష్ణకుమారి, ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read more