బైక్‌ అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-09-13T06:29:02+05:30 IST

బైక్‌ అదుపుతప్పిన ఘటనలో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరుకు చెందిన గొలగాని రామ్‌ప్రకాష్‌ అచ్యుత సాయి(20) మృతి చెందినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు.

బైక్‌ అదుపుతప్పి బీటెక్‌ విద్యార్థి మృతి

కొవ్వూరు, సెప్టెంబరు 12: బైక్‌ అదుపుతప్పిన ఘటనలో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరుకు చెందిన గొలగాని రామ్‌ప్రకాష్‌ అచ్యుత సాయి(20) మృతి చెందినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు. సాయి బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుచున్నాడు. ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు తన స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి 1 గంట సమయంలో పంగిడి వైపు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామశివారు గోవర్ధనగిరి మెట్ట వద్ద జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు.. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు.  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read more