భై భై గణేషా

ABN , First Publish Date - 2022-09-11T07:02:50+05:30 IST

బిక్కవోలులోని ప్రాచీన లక్ష్మీగణపతి ఆలయం లో నిర్వహిస్తున్న చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం దేవదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ వి.త్రినాధరావు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

భై భై గణేషా

 వైభవంగా గణపతి నిమజ్జనోత్సవాలు 

 రూ.లక్షా 30వేలు పలికిన దివాన్‌చెరువు వినాయకుడి లడ్డూ 

గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు నిర్వహించిన గణనాధుడి విగ్రహాలకు శనివారం నిమజ్జనోత్సవం  వైభవంగా నిర్వహించారు. ఆయా వినాయక మండపాల్లో ఏర్పాటుచేసిన లడ్డూలకు వేలం పాటలు నిర్వహించి భక్తులు పాడుకున్నారు. గణనాధుడి విగ్రహాలను ట్రాక్టర్లపై ఊరేగిస్తూ గోదావరి రేవులు, ఘాట్‌లు, కాలువలు, చెరువుల్లో  నిమజ్జనం చేశారు

బిక్కవోలు లక్ష్మీగణపతిని దర్శించిన ఆర్‌జేసీ

బిక్కవోలు, సెప్టెంబరు 10: బిక్కవోలులోని ప్రాచీన లక్ష్మీగణపతి ఆలయం లో నిర్వహిస్తున్న చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం దేవదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ వి.త్రినాధరావు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయనను ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ. సుబ్బారెడ్డి, ఆలయకమిటీ చైర్మన్‌ తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి, ఆలయ ఈవో ఏ.భాస్కర్‌ స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బుద్దాల కన్నారావుయాదవ్‌, పురావస్తు శాఖ ఉద్యోగి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు

గ్రామంలోని ప్రాచీన లక్ష్మీగణపతి ఆలయంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న వినాయకచవితి ఉత్సవాలు శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహాన్నదానంతో ముగిశాయి. కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ. సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఐదువేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ కమిటీ చైర్మన్‌ తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి తెలిపారు

బిక్కవోలు వినాయకుని లడ్డూ రూ. 36వేలు

గ్రామంలోని ప్రాచీన లక్ష్మీగణపతికి మండపేట సురుచి వారు బహూకరించిన లడ్డూను శనివారం వేలం నిర్వహించగా విజయవాడకు చెందిన పర్వత్‌సింగ్‌ రూ.36వేలకు పాడుకుని సొంతం చేసుకున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారంతో ముగియడంతో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను నిమజ్జనాలు చేశారు. బిక్కవోలులో వివిధ ప్రాంతాల్లో  15 వినాయక విగ్రహాలను స్థానిక సామర్లకోట కాలువలో నిమజ్జనం చేశారు. 

దివాన్‌చెరువు శ్రీలక్ష్మీగణపతి లడ్డూ రూ. లక్షా 30 వేలు 

దివాన్‌చెరువు: దివాన్‌చెరువు గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మీగణపతి లడ్డూ ప్రసా దానికి భారీధర పలికింది. గణపతి నవరాత్రులు సందర్భంగా ఆలయంవద్ద శుక్రవారంరాత్రి లడ్డూ ప్రసాదం పాటను ఆలయకమిటీ నిర్వహించింది. ఈ పాటలో 52 కేజీల లడ్డూ ప్రసాదాన్ని తనకాల రవికుమార్‌ రూ.1.30 లక్షలకు దక్కించుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 11 కిలోల లడ్డూప్ర సాదాన్ని ఫ్రెండ్స్‌ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌ నాగిరెడ్డి రూ.30 వేలకు, 5 కేజీల లడ్డూ ప్రసాదాన్ని రూ.20 వేలకు కోలా పార్ధసారధి, మూడు కిలోల లడ్డూ ప్ర సాదా న్ని నీలపాల పండు రూ.7,500లకు పాడుకున్నట్లు కమిటీ వారు తెలిపారు. 

 లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీలోని నిర్మలగ్రామ పురస్కార్‌ కళావేదిక వద్ద ఏర్పాటుచేసిన శ్రీవరసిద్ధి వినాయకుని ఉత్పవ విగ్రహంను శ్రీవ రసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కాలనీలలోని ఊరేగించి అనంతరం నిమజ్జనానికి తీసుకు వెళ్లారు. 

రాజానగరం: మండల కేంద్రమైన రాజానగరంతో పాటుగా చక్రద్వార బం ధం, వెలుగుబంద, నరేంద్రపురం, నందరాడ, కానవరం, పల్లకడియం, రాధేయ పాలెం, ఫరిజెల్టిపేట, సూర్యారావుపేట, మల్లంపూడి, తోకాడ, ముక్కినా డ, సీతారాంపురం, కలవచర్ల గ్రామాల్లో గణపతి నవరాత్రి ముగింపు ఉత్స వాలను వైభవంగా నిర్వహించారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్‌లోని లడ్డూకు ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో శనివారం వేలం నిర్వహించారు. గ్రామ ఉపసర్పం చ్‌ కొల్లి వీర్రాజు వేలంలో రూ.14.500లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపారు. 

సీతానగరం : గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడిని విగ్రహాలకు మండలంలోని ఎంపికచేసిన గోదావరి రేవులు, ఘాట్‌ల వద్ద నిమజ్జనం చేశారు. సీతానగరం, రాపాక, రఘుదేవపురం, ముగ్గళ్ళ, గ్రామాలలో  ఏర్పాటుచేసిన అధిక సంఖ్యలో విగ్రహాలను ముగ్గళ్ళ ఘాట్‌ వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. పెద్ద విగ్రహాలు రావడంతో గోదావరి ప్రవాహం ఎక్కువఉన్నందున పడవలను రప్పించి విగ్రహాలను పడవపై ఎక్కించి నిమజ్జనం చేశారు.

రూ.34 వేలు పలికిన స్నేహ గణపతిస్వామి లడ్డూ 

అనపర్తి:  అనపర్తిలోని ధరణికోట శివాలయం వద్దగల ఎర్రకాలువ రేవులో నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా పలు మండపాలవద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి మార్కెండేయపురంలోని స్నేహ యూత్‌ ఆధ్వర్యంలో స్నేహ గణపతి లడ్డూ ప్రసాదానికి వేలంపాటలో నామాల అప్పా రావు 34వేలకు దక్కించుకున్నారు. బాపనమ్మ ఆలయ సమీపంలోని బాల గణపతిని ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. 

మహా అన్నదానం

ధవళేశ్వరం: రథం వీధి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి మండపంవద్ద శనివారం ఉదయం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. అనంతరం నిర్వహించిన మహాఅన్నదానంలో వేలాదిమంది భక్తు లు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యడ్ల మహేష్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 

లడ్డూ ప్రసాదానికి లాటరీ

అన్ని మండపాలవద్ద స్వామి వారికి నివేదించిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేస్తుండగా, రఽథంవీధి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ గణేష్‌ మండపంవద్ద లడ్డూ ప్రసాదాన్ని లాటరీ పద్ధతిలో అందించడం విశేషం. స్వామివారికి రూ.50 చందాగా సమ ర్పించిన ప్రతి భక్తుడి పేరిట ఇచ్చే రసీదులను శనివారంరాత్రి మండపం వద్ద లాటరీ తీశారు. పేరు వచ్చిన భక్తుడికి 20 కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. ఆదివారం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించి గోదావరిలో స్వామి వారిని నిమజ్జనం చేయనున్నారు.



Updated Date - 2022-09-11T07:02:50+05:30 IST