భవానీ మృతిపై స్పందించకపోవడం శోచనీయం

ABN , First Publish Date - 2022-09-08T06:46:33+05:30 IST

చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని మాతా రమా భాయి మహిళా సంఘం అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని విమర్శించారు.

భవానీ మృతిపై స్పందించకపోవడం శోచనీయం

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 7: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని మాతా రమా భాయి మహిళా సంఘం అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని విమర్శించారు. రాష్ట్రంలో దళిత, గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. భవానీ న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. కుల దుర హంకారుల వేధింపుల వల్లే భవానీ ఆత్మహత్యకు పాల్పడింద న్నారు. రిలే దీక్షకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సభ్యుడు జంగా బాబూరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. భవానీ మృతికి కారకుడైన దంగేటి రాంబాబును తక్షణం అరెస్టు చేయాలని డిమాండు చేశారు. దీక్షాపరులకు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్‌, వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు బొంతు రమణ, ఎరుకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మానుపాటి గోవిందు, నాయ కుడు రేవు తిరుపతిరావు  సంఘీభావం తెలిపారు. Read more