జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.12,257 కోట్లు

ABN , First Publish Date - 2022-06-11T06:16:24+05:30 IST

జిల్లాలో వ్యవసాయ అనుబంధరంగాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.12,257 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.12,257 కోట్లు

రాజమహేంద్రవరం, జూన్‌10 (ఆంఽఽఽధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయ అనుబంధరంగాలు,  చిన్న, మధ్య తరహా  పరిశ్రమలకు  సంబంధించి   2022-23 ఆర్థిక సంవత్సరానికి  రూ.12,257 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక  రూపొందించినట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవా రం నిర్వహించిన  జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష  సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు బ్యాం కులు సహకారం అందించాలన్నారు. జిల్లాలో 23 ఆర్బీకేలను ఏటీఎంల ఏర్పాటుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపీ మార్గాని  భరత్‌  రామ్‌  మాట్లాడుతూ జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుపై బ్యాంకర్లు దృష్టి సారించి, రుణ  సౌకర్యం కల్పించాలని కోరారు.  జిల్లాలో జన సమూహం గల బస్టాండ్ల వద్ద మెప్మా బజారు  ఏర్పాటు చేయాలని, దీనికి ఎంపీ లాడ్స్‌ నుంచి నిధులు మంజూరు చేస్తానన్నారు. లీడ్‌  బ్యాంకు  మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ  నూతన  జిల్లాలో 33 బ్యాంకులు ఉండగా 293 బ్రాంచ్‌ల ద్వారా ప్రజలకు  సేవలందిస్తున్నామన్నారు.మెప్మా ప్రాజెక్టు ఆఫీసరు శ్రీనివాసరావు   మా ట్లాడుతూ, రాజానగరం, రంగంపేట, ప్రాంతాల్లో తాటి ఆకులు, పీచు పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక ఇచ్చామన్నారు.సమావేశంలో బ్యాంకర్స్‌ కన్వీనర్‌ డీజీఎం ఆర్‌.కృష్ణయ్య,ఎల్‌డీఎం శ్రీనివాసరావు, నాబార్డు డీడీఎం  సోమునాయుడు,డీఏవో ఎస్‌.మాఽధవరావు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ మేనేజర్‌  ఉపేంద్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  చీఫ్‌ మేనేజర్‌  శ్రీనివాస రావు, కెనరా బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ రామచంద్రరావు,  ఇండియన్‌ బ్యాంక్‌ డీజెడ్‌ఎం కె.గణపతి,ఓవర్సీస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామకృష్ణ, పం జాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  మేనేజర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-11T06:16:24+05:30 IST