బాలబాలాజీ స్వామిని దర్శించుకున్న రాజమహేంద్రవరం జడ్జి

ABN , First Publish Date - 2022-12-12T00:49:49+05:30 IST

అప్పనపల్లి శ్రీబాలబాలాజీ స్వామివారిని రాజమహేంద్రవరం జడ్జి పి.జ్యోతిర్మయి దంపతులు ఆదివారం దర్శించుకు న్నారు.

బాలబాలాజీ స్వామిని దర్శించుకున్న  రాజమహేంద్రవరం జడ్జి

మామిడికుదురు, డిసెంబరు 11: అప్పనపల్లి శ్రీబాలబాలాజీ స్వామివారిని రాజమహేంద్రవరం జడ్జి పి.జ్యోతిర్మయి దంపతులు ఆదివారం దర్శించుకు న్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలకగా అర్చకస్వాము లు ప్రత్యేక పూజలు చేయించారు. జడ్జి దంపతులకు సహాయ కమిషనర్‌ ఎంకేటీ నాగవరప్రసాద్‌ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆదివారం 1,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వివిధ ఆ ర్జిత సేవల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.1,18,488 ఆదాయం వచ్చిందని సహాయ కమిషనర్‌ తెలిపారు. భక్తులకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుం డా ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-12-12T00:49:49+05:30 IST

Read more