-
-
Home » Andhra Pradesh » East Godavari » badminton sportsman sathivik sathkaram-NGTS-AndhraPradesh
-
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్‌కు సన్మానం
ABN , First Publish Date - 2022-09-11T06:58:30+05:30 IST
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను అమలాపురం బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరిం చారు.

అమలాపురం టౌన్, సెప్టెంబరు 10: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను అమలాపురం బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరిం చారు. కామన్వెల్త్ గేమ్స్‌తోపాటు వరల్డ్ చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాధిం చిన విజయాలను వక్తలు కొనియాడారు. చింతలపూడి సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, బులియన్ అసోసియే షన్ కార్యదర్శి అనుపోజు శ్రీనివాస్, కోశాధికారి వాసిరెడ్డి నాయుడు, బులియన్ నాయకులు బోనం సత్యవరప్రసాద్, గైక్వాడ్ దుర్గాప్రసాద్, మానే ప్రకాష్, వాసిరెడ్డి ఈసు, మద్దింశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొని సాత్విక్‌కు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.