-
-
Home » Andhra Pradesh » East Godavari » backlog posts applications-NGTS-AndhraPradesh
-
బ్యాక్లాగ్ వైద్య ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-02-19T05:38:18+05:30 IST
జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న మూడు బ్యాక్లాగ్ పోస్టులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి డాక్టర్ టి.రమేష్‌కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాజమహేంద్రవరం
అర్బన్, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో
ఖాళీగా ఉన్న మూడు బ్యాక్లాగ్ పోస్టులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్
ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని
జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి డాక్టర్ టి.రమేష్‌కిశోర్ ఒక ప్రకటనలో
తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో ఫార్మసిస్ట్ గ్రేడ్- 2 ఓ పోస్టు భర్తీ
చేయనున్నట్టు చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌లో ఆడియోమెట్రీషియన్ ఒక పోస్టు,
థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్టు భర్తీ చేస్తామని చెప్పారు. అర్హులైన, ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ
దరఖాస్తులను ఈనెల 19నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా
రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి క్యాంపస్‌లోని వైద్యసేవల
సమన్వయాధికారి వారి కార్యాలయంలో స్వయంగా అందజేయాలని ఆయన కోరారు.