ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పర్యటన

ABN , First Publish Date - 2022-07-18T07:06:35+05:30 IST

వరద ప్రాంతాలలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ముం పునకు గురైన ఆలమూరు మండలం బడుగువానిలంకలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి విద్యుత్‌ సమస్యలను గుర్తించారు. బడుగువానిలంక గ్రామంలోనికి ఆయన నావపై వెళ్లారు.

ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పర్యటన
పర్యటిస్తున్న సీఎండీ

ఆలమూరు, జూలై 17: వరద ప్రాంతాలలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ముం పునకు గురైన ఆలమూరు మండలం బడుగువానిలంకలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి విద్యుత్‌ సమస్యలను గుర్తించారు. బడుగువానిలంక గ్రామంలోనికి ఆయన నావపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రాంతాలలో 12.5 మీటర్ల ఎత్తు గల విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయనున్నామని దీంతో వరదలు వచ్చినప్పటికీ నిరంతరంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. బడుగువానిలంకలో వరద తీసిన వెంటనే విద్యుత్‌ స్తంభాలను మార్పు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామంలో తక్షణం విద్యుత్‌ అందించే విధంగా ట్రాన్స్‌ఫార్మర్లను మార్పు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. సీఎండీ సంతోష్‌రావు వెంట సీజీఎం సూర్యప్రతాప్‌, ఎస్‌ఈవో టీవీఎస్‌ఎన్‌ మూర్తి, డీఈసీ దాట్ల ధర్మవర్మ, ఏడీఈ జి.తిరుమలరావు తదితరులు ఉన్నారు.

Read more