వైసీపీ పాలనలో తీవ్రమైన సంక్షోభం

ABN , First Publish Date - 2022-09-19T05:42:28+05:30 IST

జగ్గంపేట, సెప్టెంబరు 18: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్నదాతలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించా రు. గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహా రం, సున్నా వడ్డీరుణాలు, ధాన్యం కొనుగోలు వం టి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రావులమ్మనగర్‌లో ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడు

వైసీపీ పాలనలో తీవ్రమైన సంక్షోభం
సమావేశంలో మాట్లాడుతున్న నెహ్రూ

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ 

జగ్గంపేట, సెప్టెంబరు 18: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్నదాతలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించా రు. గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహా రం, సున్నా వడ్డీరుణాలు, ధాన్యం కొనుగోలు వం టి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రావులమ్మనగర్‌లో ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ రైతుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి రైతులంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా కేంద్రాలు వారికి ఏమాత్రం ఉపయోగపడడంలేదన్నారు. వైసీపీ పాలనలో రైతుల మెడలకు ఉరితాళ్లు వేలాడుతున్నాయన్నారు. వి త్తనాలు, పురుగుల మందులు, ఎరువులపై సబ్సిడీలను ఎత్తివేయడంతో అధిక ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్‌బీకేల్లో ఆ ర్భాటం తప్ప ఉపయోగం ఏమీ ఉండడంలేదని నెహ్రూ విమర్శించారు. సమావేశంలో నాయకు లు అడపా భరత్‌బాబు, ఉంగరాల రాము, రెడ్డి కాశి, చింతల రామకృష్ణ, రాయుడు పాల్గొన్నారు.


నాయకులకు అభినందన సభ

కిర్లంపూడి, సెప్టెంబరు 18: గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీలో వివిధ పదవులు పొందిన అందరిని బుధవారం అభినందించడానికి సభ ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆదివారం జగపతినగరంలో న్యూమెన్‌మిషన్‌లో గల సభ ప్రాంగణానికి ఆడిటోరియాన్ని పరిశీలించా రు. ప్రతీ కార్యకర్తకు టీడీపీ సముచితస్థానం కల్పిస్తుందని, అందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి అధికారంలోకి తీసుకురావాల న్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు చదరం చంటిబాబు, కాకినాడ జిల్లా క్రిస్టియన్‌ మైనారిటీసెల్‌ అధ్యక్షుడు కన్నబాబు, ఎంపీటీసీ కాళ్ల దొంగబాబు, తూముకుమార్‌, కుర్ల చినబాబు, గుడాల రాంబాబు, అడబాల భాస్కరరావు, మాదిరెడ్డి సూరిబాబు, ఆడారి నానాజి, సరిసే శివ ఉన్నారు. 

Read more