జగన్‌కు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి

ABN , First Publish Date - 2022-09-10T06:24:01+05:30 IST

గొల్లప్రోలు, సెప్టెంబరు 9: ఏసీ రూముల్లో ఉండే సీఎం జగన్‌కు ఇక్కడ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఎద్దేవా చేశారు. సుద్దగడ్డ వరద నీటితో ముంపునకు గు రైన గొల్లప్రోలు పట్టణ శివారులోని జగనన్న కాలనీకి

జగన్‌కు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి
గొల్లప్రోలులో రహదారిని పరిశీలిస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు, సెప్టెంబరు 9: ఏసీ రూముల్లో ఉండే సీఎం జగన్‌కు ఇక్కడ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఎద్దేవా చేశారు. సుద్దగడ్డ వరద నీటితో ముంపునకు గు రైన గొల్లప్రోలు పట్టణ శివారులోని జగనన్న కాలనీకి వెళ్లే రహదారిని ఆయన శుక్రవారం పరిశీలించారు. కొద్దిపాటి వర్షానికే కాలనీ ముంపునకు గురయిందని, కనీసం వెళ్లేదారి కూడా లేదన్నారు. సు ద్దగడ్డ వరదల కారణంగా గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఏలేరు ఆధునీకరణ ఫేజ్‌-2 కింద టీడీపీ హాయాంలో రూ.140కోట్లు తీసుకువచ్చి పనులు ప్రారంభించామని, కానీ వైసీపీ రద్దు చేసిందని తెలిపారు. ఇటీవల గొల్లప్రోలులో జగన్‌ సభలో వైసీపీ ప్రజాప్రతినిధులు తాము ఏలేరు ఆధునీకరణకు నిధులు ఇచ్చినట్లు గొప్పగా చెప్పించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ రూపాయి వెచ్చించింది లేదని విమర్శించారు. ముంపు ప్రాంతాలపై తా ము ముందస్తు ఆలోచనతో ఆధునీకరణ పనులు తెస్తే మూడేళ్లలో మీరు చేసిందేంటని ప్రశ్నించారు. తక్షణం జగనన్న కాలనీకి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, కడారి బాబ్జి పాల్గొన్నారు.

లబ్ధిదారులకు అగచాట్లు

పట్టణ శివారులో జగనన్న కాలనీ లబ్ధిదారులకు అగచాట్లు తప్పడం లేదు. 3రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీకి వెళ్లే రహదారిపై 4అడుగుల ఎత్తున వరద నీరు చేరింది. కాలనీకి వెళ్లే రోడ్డు తరచూ ముంపునకు గురవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అక్కడి లబ్ధిదారులు శుక్రవారం గొల్లప్రోలు నగరపంచాయతీ కమిషనరు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. 

Read more