అంతర్వేది హుండీ ఆదాయం రూ.41,79,905

ABN , First Publish Date - 2022-02-19T06:40:17+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాల అనంతరం శుక్రవారం స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు.

అంతర్వేది హుండీ ఆదాయం రూ.41,79,905

అంతర్వేది, ఫిబ్రవరి 18: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాల అనంతరం శుక్రవారం స్వామివారి హుండీల  ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామివారి ప్రధాన ఆలయ హుండీ ఆదాయం రూ.40,70,878 వచ్చింది. అలాగే  అన్నదాన హుండీ ఆదాయం రూ.29,152, గుర్రాలక్కమ్మ హుండీ ఆదాయం రూ.79,875 రాగా మొత్తం 30 రోజులకుగాను స్వామివారి హుండీల ఆదాయం రూ.41,79,905 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. 

Read more