సత్యదేవుడికి బంగారు గిన్నెలు

ABN , First Publish Date - 2022-09-11T06:15:22+05:30 IST

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శనివారం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కందుల వెంకటేశ్వరస్వామి 100 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు గిన్నెలను సమర్పించారు.

సత్యదేవుడికి బంగారు గిన్నెలు

అన్నవరం. సెప్టంబరు 10: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శనివారం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కందుల వెంకటేశ్వరస్వామి 100 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు గిన్నెలను సమర్పించారు. వీటిని ఆలయ పీఆర్వో కొండలరావుకు దాత అందజేయగా దాతను ఆయన అభినందించారు. అలాగే అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవా నిత్యాన్నదాన పఽథకానికి శనివారం గుంటూరుకు చెందిన చిరుమామిళ్ల సందీప్‌ చౌదరి రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ పీఆర్వోకు అందజేయగా దాతకు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన గుర్తింపు కార్డును కొండలరావు అందజేశారు.

Read more