-
-
Home » Andhra Pradesh » East Godavari » anganwadi worker tells problems mla dorababu-NGTS-AndhraPradesh
-
ఎమ్మెల్యే ఎదుట అంగన్వాడీ వర్కర్ల ఆవేదన
ABN , First Publish Date - 2022-08-17T05:59:40+05:30 IST
గొల్లప్రోలు, ఆగస్టు 16: గ్యాస్ స్టవ్లు ఇచ్చి పదేళ్లు అయింది. ఉన్న సిలిండర్లకు కార్డులు లేవు..గర్భిణులు, చిన్నారులకు వీటి పై వండి వడ్డించాలంటే ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు 7,8వ వార్డుల్లో మంగళవారం గడపగడపకు ప్రభు

గొల్లప్రోలు, ఆగస్టు 16: గ్యాస్ స్టవ్లు ఇచ్చి పదేళ్లు అయింది. ఉన్న సిలిండర్లకు కార్డులు లేవు..గర్భిణులు, చిన్నారులకు వీటి పై వండి వడ్డించాలంటే ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు 7,8వ వార్డుల్లో మంగళవారం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. వర్కర్లు స్టవ్లు పూర్తి గా పాడయ్యాయని, సక్రమంగా పనిచేయడం లేదని విన్నవించారు. కొత్త స్టవ్లు ఇవ్వడంతో పాటు గ్యాస్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీఇచ్చారు.