నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-10T00:56:33+05:30 IST

నిధులు దుర్వినియోగానికి పాల్పడిన అర్తమూరు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

నిధుల దుర్వినియోగానికి   పాల్పడిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

ఉపసర్పంచ్‌, వార్డు సభ్యుల ఫిర్యాదు

మండపేట, డిసెంబరు 9: నిధులు దుర్వినియోగానికి పాల్పడిన అర్తమూరు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతులను పత్రికలకు విడుదల చేశారు. పంచాయతీ పరిధిలో 9మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తుంటే, పది మంది పనిచేస్తున్నట్టు చూపించి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. చెత్త తరలిం పు విషయంలో కూడా రూ.26వేలు డ్రాచే శారని, డ్రైన్లలో సిల్టు తీయకుండా రూ.7100 డ్రా చేశారన్నారు. ఇలా చేయని పనులకు చేసినట్టు రికార్డుల్లో చూపించి పంచా యతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డార న్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ చెందిన ఉపసర్పంచ్‌ కర్రి సత్యనారాయణరెడ్డి, పంచా యతీ సభ్యులు చిర్ల చంద్రారెడ్డి, టి.వెంకటరెడ్డి, సుమలత, నార్కెడ్‌మిల్లి కనకలక్ష్మీదేవి, ఎ.లక్ష్మి, కె.శ్రీనివాసరావు, పట్నాల సత్యనారాయణమూర్తి, మేడపాటి వీర్రాఘవరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-12-10T00:56:34+05:30 IST