అమరుల ఆశయ సాధనకోసం కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-11-25T00:57:51+05:30 IST

విప్లవ అమరవీరుల ఆశయ సా ధనకు కృషిచేయాలని, దోపిడీ, పీడన, వివక్ష వంటి అసమానత లకు వ్యతిరేకంగా పోరాడాలని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీ రాంజనేయులు పిలుపునిచ్చారు.

అమరుల ఆశయ సాధనకోసం కృషి చేయాలి

పెద్దాపురం, నవంబరు 24 : విప్లవ అమరవీరుల ఆశయ సా ధనకు కృషిచేయాలని, దోపిడీ, పీడన, వివక్ష వంటి అసమానత లకు వ్యతిరేకంగా పోరాడాలని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీ రాంజనేయులు పిలుపునిచ్చారు. అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని గురువారం మాట్లాడారు. ముందుగా పట్టణంలోస్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంవద్ద నుంచి ర్యాలీగా రైతుకూలీలు ఎర్ర జండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక పాత ఆసుపత్రి వీధిలో ఉన్న తెలగాభ్యుదయ సం ఘ భవనంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకుడు కొండా దుర్గారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ము ందుగా అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళుల ర్పించారు. రాష్ట్ర నాయకుడు దుర్గారావు మాట్లాడుతూ ప్రజల హక్కులను కాలరాసే ఎన్నో చట్టాలను తయారవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు విప్లవ గీతాలను ఆలపించారు. ఈకార్యక్రమంలో ఏపీ రైతుకూలీ సంఘం ఇల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్‌టీ యూ జిల్లా కార్యదర్శి ఆర్‌.సతీష్‌, ఏపీఆర్‌సీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్‌, జిల్లా నాయకులు మడికి సత్యం, డాన్‌ శ్రీను, సురేష్‌, మంగ పాల్గొన్నారు.

సుకుంటున్నామని ఆయ

Updated Date - 2022-11-25T00:57:51+05:30 IST

Read more