రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలి

ABN , First Publish Date - 2022-09-13T06:28:30+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగాలని కోరుతూ అక్కడి రైతులు చేపట్టిన మహోద్యమం విజయవంతం కావాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలి

కొత్తపేట, సెప్టెంబరు 12: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగాలని కోరుతూ అక్కడి రైతులు చేపట్టిన మహోద్యమం విజయవంతం కావాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. అమరావతి రైతుల వెయ్యి కిలోమీటర్లు యాత్ర ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మొండి పట్టుదలతో అమరావతి రాజధానిని అడ్డుకుని మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న త్యాగాలకు సంఘీభావం తెలియజేద్దామని ర్యాలీ నిర్వహించినట్టు సత్యానందరావు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేత కంఠంశెట్టి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు బూశి జయలక్ష్మి, పల్లి భీమారావు, త్సామా బాబు, నాయకులు మిద్దే ఆదినారాయణ, మిద్దే అనూరాధ, రెడ్డి తాతాజీ,  చవల జగన్నాఽథం, సరెళ్ల రాజబాబు, ధర్నాల రామకృష్ణ, యల్లమిల్లి జగన్మోహన్‌, పల్లికొండ సుధీర్‌, బీర ఇస్సాక్‌, గుబ్బల మూర్తి, అద్దంకి చంటిబాబు, ముద్రగడ సుబ్బారావు, బూశి విష్ణుమూర్తి, బండారు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
Read more