అమలాపురం అల్లర్ల కేసులో మరో 18 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-06-07T07:01:15+05:30 IST

అమలాపురం అల్లర్లకు సంబంధించి మరో పద్దెనిమిది మందిని సోమవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అమలాపురం అల్లర్ల కేసులో మరో 18 మంది అరెస్టు

ఇందులో గంధం పల్లంరాజు సహా మరో ఇద్దరు రౌడీషీటర్లు 8 వెల్లడించిన ఎస్పీ సుబ్బారెడ్డి

అమలాపురం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అమలాపురం అల్లర్లకు సంబంధించి మరో పద్దెనిమిది మందిని సోమవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసుల్లో అర్టెయిన వారి సంఖ్య 129కి చేరింది. అరెస్టయిన వారిలో టీడీపీకి చెందిన యువ నాయకుడు గంధం పల్లంరాజు ఉన్నారు. ఈయన మాజీ హోం మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప కీలక అనుచరుడు. మరో ఇద్దరు రౌడీషీటర్లయిన గంపా అనిల్‌, యాళ్ల నాగు అరెస్టు అయ్యారు. కాగా వస్త్ర వ్యాపారి కాటా బాలయ్య కుమారుడైన కాటా మధును కొన్ని రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతని అరెస్టు చూపించకపోవడంతో కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు కాటా మధును అరెస్టు చేసినట్టు చూపించారు. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌ పెట్టి వారిని ఆందోళనకు ప్రేరేపించిన గ్రూప్‌ క్రియేటర్స్‌, సీసీ టీవీల్లో గుర్తించిన వారిని ఈ కేసుల్లో అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

అరెస్టయిన వారి వివరాలు.. 

గంధం పల్లంరాజు (44) అమలాపురం, గంపా అనిల్‌ (24) (రౌడీషీటర్‌) శ్రీరామపురం, యాళ్ల నాగు (25) (రౌడీషీటర్‌, మోడేకుర్రు), కాటా మధు (25) నల్లా వీధి, కొప్పుల వీరబాబు (22) గండు వీధి, చిక్కం వీర వెంకట దుర్గారావు (26) గాంధీనగర్‌, బండారు భీమశంకర్‌ (36) కురసాల వారి వీధి, గొవ్వాల లిల్లీస్‌రాజు (27) రావులచెరువు, కేతా ప్రసాద్‌ (28) శ్రీరామపురం, మల్లాడి హరిశివశంకర్‌ (32) మిక్చర్‌ కాలనీ, అడపా తాతాజీ అలియాస్‌ బాబి (30) గాంధీనగర్‌, గోకరకొండ సీతారాముడు (30) నల్లమిల్లి, గుండుమోగుల తేజ (20) ఈదరపల్లి, సత్తి వెంకటరత్నం (30) కొంకాపల్లి, జాన గణేష్‌ (38) వుయ్యూరువారిమెరక, గుత్తుల నాగరాజు (28) చినతిల్లకుప్ప, ఏపుగంటి ఏడుకొండలు (48) కూనవరం, గోకరకొండ అజయ్‌ (19).Read more