అధికారపక్షమా.. ప్రతిపక్షమా!

ABN , First Publish Date - 2022-09-28T05:55:44+05:30 IST

అమలాపురం పట్టణ పరిస్థితు లపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల వాగ్వివాదాలతో పాటు అధికారపక్ష కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక దశలో అధికారపక్ష కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌పై కమిష నర్‌ అయ్యప్ప నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారపక్షమా.. ప్రతిపక్షమా!
కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యం

  • అధికారపక్ష కౌన్సిలర్‌పై కమిషనర్‌ అగ్రహం
  • పురపాలక సంఘాన్ని రక్షించండంటూ జనసేన కౌన్సిలర్ల నిరసన
  • వాడివేడిగా అమలాపురం కౌన్సిల్‌ సాధారణ సమావేశం

అమలాపురం టౌన, సెప్టెంబరు 27: అమలాపురం పట్టణ పరిస్థితు లపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల వాగ్వివాదాలతో పాటు అధికారపక్ష కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక దశలో అధికారపక్ష కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌పై కమిష నర్‌ అయ్యప్ప నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే పురపాలక సంఘాన్ని రక్షించండంటూ జనసేన కౌన్సిలర్లు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేయడంతో అమలాపురం పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా సాగింది. 

మున్సిపల్‌ చైర్‌పర్సన రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమావేశ మందిరంలోకి ఎటువంటి ప్లకార్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసుకు రాకూ డదని, అలా తెచ్చి ఉంటే సిబ్బందికి అందజేయాలని చైర్‌పర్సన ప్రకటించారు. సమావేశం ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్షమైన జనసేన కౌన్సి లర్లు యేడిద శ్రీను ఆధ్వర్యంలో పురపాలక సంఘాన్ని రక్షించండంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. పురపాలక సంఘానికి ఏం జరిగిందో చెప్పాలని అధికారపక్ష కౌన్సిలర్లు సంసాని బులినాని, రాజేష్‌ ప్రశ్నించారు. డంపింగ్‌ యార్డు రోడ్డు అధ్వాన స్థితికి చేరుకుందని, చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారని, పక్కనే ఉన్న నల్లా సూర్యచంద్రరావు ఘాట్‌ను సైతం పట్టిం చుకోకుండా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్‌ పిండి అమరావతి అధికారుల తీరును తప్పుబట్టారు. అసలు తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారా అని కౌన్సిలర్‌ తిక్కా సత్యలక్ష్మి ప్రశ్నించారు. ప్రతినెలా డంపింగ్‌ యార్డు వద్ద రోడ్డు పక్కన వేసిన చెత్తను మళ్లించడానికి లక్షలాది రూపాయలు వె చ్చించడం సమంజసమా అని ప్రశ్నించారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భా గంగా ఎన్ని వాహనాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింద న్నారు. గతంలో డంపింగ్‌ యార్డుకు వెళ్లేందుకు మార్గం ఉండడంతో పాటు ఆ ప్రాంతంలోని శ్మశానవాటికను సైతం సుందరవనంగా తీర్చిదిద్దారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ సమయంలో అధికారపక్షానికి చెందిన కౌన్సిలరు బులినాని కలుగజేసుకుని మూడు నెల ల్లో అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. డ్రైనేజీ సమస్యను సైతం పరిష్కరించలేకపోతున్నారని కౌన్సిలర్‌ గండి దేవిహారిక పేర్కొన్నారు. వర్షాలు వస్తున్నాయని, పనులు చేయరా అని అధికారుల తీరుపై మండిపడ్డారు.  అమలాపురం పట్ట ణంలో ఎక్కడపడితే  అక్కడ పెద్ద పెద్ద హోర్డింగులు ఉన్నాయని, వాటిపై ఎంత ఆదాయం వస్తోందని అధికారపక్ష కౌన్సిలర్‌ చిట్టూరి పెదబాబు ప్రశ్నించారు. పట్టణంలో కోట్ల రూపాయల మేర వ్యాపారాలు జరుగు తుంటే, ప్రకటన బోర్డుల ద్వారా కేవలం రూ.5లక్షలే ఆదాయం వస్తోందా అని మండిపడ్డారు. ఆక్రమణ పన్నులతో పాటు హోర్డింగుల ద్వారా రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సిటీ కేబుల్‌, నెట్‌వర్క్‌ల నుంచి ప్రకటన పన్నులు వసూలు చేస్తున్నారా అని, ఆ జీవోను చూపించాలని కౌన్సిలర్లు ప్రశ్నించారు. సాల్వెన్సీ అగ్రి మెంటు లేకుండా మున్సిపల్‌ షాపులను ఎలా అద్దెకు ఇస్తారని కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌ ప్రశ్నించారు. గతంలో తీసుకున్న సాల్వెన్సీల వివరాలను వెల్లడించాలని డిమాండు చేశారు. గతంలో అధికా రులు ఏం చేశారో మాకు తెలియదు. పాత వివరాలు అందుబాటులో లేవంటూ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు సమాధానం చెప్పడంతో సహచర అధికారపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపాలిటీలో రికార్డులు అందుబాటులో ఉండట్లేదంటే జనసేన కౌన్సిలర్లు ప్లకార్డులు ప్రదర్శించడం తప్పుకాదేమో అనిపిస్తోందన్నారు. సర్క్యులర్‌ బజార్‌లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న రైల్వే రిజర్వేషన కౌంటర్‌ ఏర్పాటుచేసిన షాపుల నుంచి లక్షలాది రూపాయల బకాయిలు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలుచేస్తే లీజుకు పొందిన లబ్ధిదారుల నుంచి విధిగా సాల్వెన్సీలు తీసుకోవాలని కోరుతూ 17, 18 ఎజెండా అంశాలను వాయిదా వేస్తున్నట్టు కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర ప్రకటించారు. కో-ఆప్షన సభ్యుడిగా ఎన్నికైన పెనుమూరి జాన్సన బిల్లి మూడు నెలలుగా సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆయన సభ్య త్వానికి అనర్హత ప్రకటించే అంశంపై సభ్యులు చర్చించారు. అయితే నిబంధనల మేరకు కో-ఆప్షన సభ్యుని లేఖను అనుసరించి కొనసాగించే అవకాశం ఉందని కమిషనర్‌ పేర్కొన్నారు. కౌశిక డ్రెయినను ఆనుకుని చిన్న వంతెన వద్ద నుంచి బైపాస్‌ రోడ్డును కలిపే నూతన రహదారికి మంత్రి పినిపే విశ్వరూప్‌ పేరిట విశ్వరూప్‌ మార్గంగా నామకరణం చేసేందుకు తీర్మానించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు తిక్కిరెడ్డి వెంకటేష్‌, రుద్రరాజు నానిరాజు, కౌన్సిలర్లు ఆశెట్టి నాగదుర్గ, పడాల శ్రీదేవి, బొర్రా వెంకటేశ్వరరావు, గొలకోటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

                            

Updated Date - 2022-09-28T05:55:44+05:30 IST