అర్హులందరికీ పింఛన్లు మంజూరు: మంత్రి

ABN , First Publish Date - 2022-01-03T06:14:49+05:30 IST

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

అర్హులందరికీ పింఛన్లు మంజూరు: మంత్రి

ద్రాక్షారామ, జనవరి 2: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం రామచంద్రపురం మండల పరిషత్‌ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ అంబటి భవానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడారు.  సమావేశంలో వైస్‌ ఎంపీపీ శాకా బాబి, ఎంపీడీవో నాగేశ్వరశర్మ, వైసీపీ నాయకుడు టేకుమూడి సత్యనారాయణ, పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పింఛను లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. Read more