ఆక్వా రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T06:30:25+05:30 IST

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమసేన రైతు విభాగం ఆక్వా సేన సంఘ సమావేశం డిమాండు చేసింది.

ఆక్వా  రైతులను ఆదుకోవాలి

ముమ్మిడివరం, ఆగస్టు 16: ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమసేన రైతు విభాగం ఆక్వా సేన సంఘ సమావేశం డిమాండు చేసింది.  సీహెచ్‌ గున్నేపల్లిలో గొలకోటి వెంకటరెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతువిభాగ అధ్యక్షుడు బసవా చినబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలోవలే అందరి రైతులకు సమానంగా విద్యుత్‌ సబ్సిడీలు ఇచ్చి నాణ్యమైన రొయ్యపిల్లలను రైతులకు అందించాలని వారు డిమాండు చేశారు. సమావేశంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు శేషుబాబు, రాష్ట్ర జనరల్‌ కార్యదర్శి పోలిశెట్టి బాబులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మేడిది శంకర్‌, ముమ్మిడివరం నియోజకవర్గ రైతుసేన అధ్యక్షులు జీఎస్‌ఎన్‌ మూర్తి, బుల్లి, యాళ్ల మునిస్వామి, వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు. 


.

Read more