మహనీయుని పేరు మార్చడం దుర్మార్గం

ABN , First Publish Date - 2022-09-24T06:14:17+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుని పేరును మార్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

మహనీయుని పేరు మార్చడం దుర్మార్గం
బండారులంకలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

  • హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై బండారులంకలో నల్లబ్యాడ్జీలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నిరసన
  • అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 23: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుని పేరును మార్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బండారులంకలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. బండారులంక పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ చింతా శంకరమూర్తి, సొసైటీ మాజీ అధ్యక్షుడు పుత్సల వరదరాజులు, మాజీ ఎంపీటీసీలు మాడా మాధవి, గోసంగి సూర్యనారాయణ తదితరులు పాలభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బండి సుబ్బారావు, ఈతకోట రాజేష్‌, కొల్లి అంబేడ్కర్‌, పెనుమాల రమణ, బళ్ల శ్రీనివాసచక్రవర్తి, చింతపట్ల చిన్నా, కొండా శ్రీను, దొంతంశెట్టి రమేష్‌, గుమ్మిడి బ్రహ్మాజీ, గోళ్ల మల్లేశ్వరరావు, మావూరి సాంబ, మాడా పద్మదుర్గాప్రసాద్‌, గుమ్మిడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. 

అల్లవరం: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ మండల కార్యాలయం వద్ద మండల శాఖ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు ఆధ్వర్యంలో అమలాపురం అసెంబ్లీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలభిషేకం చేసి శుద్ధి చేశారు. చింతా శ్రీనివాస్‌, వేగిరాజు వెంకట్రాజు, గోసింగి స్టాలినబాబు, తోట నరసింహారావు, యాళ్ల కాసుబాబు, పొలమూరి ధర్మపాల్‌, అడపా కృష్ణ, అల్లూరి సోమరాజు, కొపనాతి తాతాజీ, ఈసకోన సాంబశివ, గెద్దాడ శ్రీనివాసరావు, పచ్చిమాల ఏడుకొండలు, ఎంపీటీసీలు మామిడిశెట్టి శ్రీనివాస్‌, ముత్తాబత్తుల రాంబాబు, ఎం.శ్రీరామ్‌, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T06:14:17+05:30 IST