‘ఆదివాసీ సమరయోధుల ప్రదర్శనతో స్ఫూర్తి పొందాలి’

ABN , First Publish Date - 2022-11-19T00:46:37+05:30 IST

షెడ్యూల్‌ తెగల జాతీయ కమ్యూనికేషన్‌ (ఎస్సీ,ఎస్టీ) అందించిన అనేక ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు సందర్శించి స్ఫూ ర్తి పొందాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథ రావు అన్నారు.

 ‘ఆదివాసీ సమరయోధుల ప్రదర్శనతో స్ఫూర్తి పొందాలి’

దివాన్‌చెరువు, నవంబరు 18 : షెడ్యూల్‌ తెగల జాతీయ కమ్యూనికేషన్‌ (ఎస్సీ,ఎస్టీ) అందించిన అనేక ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు సందర్శించి స్ఫూ ర్తి పొందాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా విద్యాక ళాశాల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఆదివాసీ సమరయోధుల పాత్ర ప్రదర్శ నను శుక్రవారం ఏర్పాటుచేశారు. దీనిని వీసీ ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్య మంలో ఆదివాసీల పోరాటం, ఆయా ప్రాంతాలలోని పరిస్థితులు, వారి త్యాగాలు అన్నీ క్లుప్తంగా ఈప్రదర్శన ద్వారా తెలుస్తాయన్నారు. ఈనెల 22వ తేదీ వరకూ వర్సిటీ లో ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 22న విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆదివాసీలపాత్ర అనే అంశంపై జాతీయ సెమినార్‌ జరుగు తుందని చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేయాలని కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌.వరహాల దొరకు తెలిపా రు. ప్రిన్సిపాల్‌ కె.సుబ్బారావు, అధ్యాపకులు ఆర్‌.సాంబశివరావు, ఎం.గోపాలకృష్ణ, జి.ఎలీ షాబాబు. వి.రామకృష్ణ, జె.రాజమణి, కె.రాజేశ్వరీదేవి,కృష్ణ,రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పాఠశాలల్లో గిరిజన ఉత్సవ ర్యాలీలు నిర్వహించాలి

ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే

రంపచోడవరం, నవంబరు 18: దేశ స్వాతంత్య్రంకోసం పోరాటం చేసి అసువులుబాసిన మహానుభావు లందరినీ స్మరించుకునే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గిరిజ నుల ఆత్మగౌరవ ఉత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా పీవో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన 130 మంది విద్యార్థులను ఎంపిక చేసి విశాఖపట్నంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ ఉత్సవాలకు పంపిస్తున్నట్టు తెలిపారు. ఏజెన్సీలోని అన్ని పాఠశాలల్లో ఆత్మగౌరవ ఉత్సవాలకు ర్యాలీలు నిర్వహించాల న్నారు. ఈనెల 21న ఉత్సవాలకు సంబంధించిన ర్యాలీలు ప్రజాప్రతినిధులతో నిర్వహించి పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీడీ సీహెచ్‌ శ్రీనివాసరావు, లైజ న్‌ అధికారి బీఎస్‌ కుమార్‌, డీడీ కార్యాలయ పర్యవేణాధికారులు కిషోర్‌, రమ ణ, ప్రధానోపాధ్యాయులు కె.ఆర్‌.పి.కుమార్‌, బుల్లయ్య, మల్లమ్మ, సీఎంవోలు ప్రసాద్‌, కె.శ్రీనివాసరావు, పీడీ కె.తిరుపతిరావు పాల్గొన్నారు.

అడ్డతీగల: మండలంలో శుక్రవారం ఆదివాసీల ఆధ్వర్యంలో ఆత్మగౌరవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించి గ్రామ పురవీధుల గుండా ప్రదర్శనలు నిర్వహిస్తు దేవీసెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయ కులు రమేష్‌ బాబు,వీరబాబు, బాతురెడ్డి, బాలురెడ్డి, సమర్త కృష్ణ, స్వర్ణలత, వరదానం, దివ్యశ్రీ తదితర నాయకులు పాల్గొన్నారు.

వై.రామవరం: దేశంకోసం పోరాడిన ఆదివాసీ నాయకుల సంస్మరణ, ఆత్మగౌరవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వై.రామవరం ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్‌సెంటర్లో మానవహరం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు లండ రాజబాబు, వెంకటరెడ్డి, నూకరాజు, చిన్నారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:46:37+05:30 IST

Read more