ఇదిగో.. అదిగో.

ABN , First Publish Date - 2022-03-16T06:45:49+05:30 IST

అదిగో..ఇదిగో.. అదే టిడ్కో ఇల్లు. రేపే మీ సొంతమవుతుంది. ఇది కొంతకాలంగా లబ్ధిదారులను అధికారులు ఊరిస్తూ చెబుతున్న మాట. ఇదిగో రిజిస్ట్రేషన్‌.. వెంటనే గృహప్రవేశమే అన్నట్టుగా హడావుడి తప్ప క్షేత్ర స్థాయిలో ఇంచుకూడా కదలని పరిస్థితి.

ఇదిగో.. అదిగో.

టిడ్కో ఇల్లు అందనంత దూరం

రాజమహేంద్రవరంలో  నత్తనడకన రిజిస్ట్రేషన్లు

2528 ఇళ్లకు ఇప్పటికి 615 రిజిస్ట్రేషన్లు పూర్తి

 మొదటి దశలో  పూర్తయినవి  21,344 

మరి గృహ  ప్రవేశాలెప్పుడో?

లబ్ధిదారుల గగ్గోలు 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 అదిగో..ఇదిగో.. అదే టిడ్కో ఇల్లు. రేపే మీ సొంతమవుతుంది. ఇది కొంతకాలంగా లబ్ధిదారులను అధికారులు ఊరిస్తూ చెబుతున్న మాట. ఇదిగో రిజిస్ట్రేషన్‌.. వెంటనే గృహప్రవేశమే అన్నట్టుగా హడావుడి తప్ప క్షేత్ర స్థాయిలో ఇంచుకూడా కదలని పరిస్థితి. సరే ఇంతకాలానికి అయినా మా సొంతమవుతుందనే ఆశ ఓవైపు కలుగుతున్నా, మరోవైపు ఈ ఏడాదైనా తమకు అప్పగిస్తారా అనే అను మానం కూడా అంతే వేగంగా చుట్టుముడుతోంది. వాస్తవానికి గత ఎన్నికల ముందే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశాలకు ముహూర్తాలు పెట్టారు. కానీ ఎన్నికలు ముంచుకొచ్చి, ఆయన తెరమరుగై పోయారు. ఎన్నికల్లో నెగ్గిన జగన్‌ ఆ.. ముహూర్తాలను పక్కన పడేశారు. అదిగో..ఇదిగో అంటున్నారు. ప్రస్తుతం రిజిస్ర్టేషన్లు చేయిస్తున్నారు. అవి కూడా నత్తనడకన జరుగుతున్నాయి. ఆ పట్టాలు తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. వాళ్లు రుణాలు ఇవ్వాలి. అది టిడ్కోకు కట్టాలి. అప్పుడే ముహూర్తం. గృహాప్రవేశం. అప్పుడే సొం తిల్లు అవుతుంది. ఇది టిడ్కో లబ్ధిదారుల పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణ ‘అందరికీ ఇళ్లు’ అనే నినాదంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. చంద్రబాబు ఉండగానే సుమారు 40 వేల ఇళ్ల వరకూ జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ మంజూరు చేశారు. స్థలాలు కూడా సేకరించారు. చాలావరకూ కట్టారు. కొన్ని మౌలిక సదుపాయాలు మినహా ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ అవి కూడా ఇప్పటివరకూ లబ్ధిదార్లకు అందలేదు. మూడు దశల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొన్ని ఇళ్లను రద్దు చేసింది. జిల్లాలో మొదటి దశలో 23,400 ఇళ్లు మంజూరుచేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమ లాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాల్టీల్లో పేదల కోసం వీటిని మంజూ రు చేశారు. అందులో కాకినాడకు సంబంధించి  2,056 ఉన్నా యి. కానీ వివిధ కారణాల వల్ల అవి ఇప్పటికీ మొదలెట్టలేదు. వాటిలో 13,800 ఇళ్లకు 90 శాతం మౌలిక సదుపాయాలు కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అడుగు ముందుకేయలేదు. కేవలం గత తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రంగులు మార్చి తమకు నచ్చిన రంగులు వేసింది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను లబ్ధిదార్లకు అప్పగించాలంటే వారి పేర ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేయించాలి. తర్వాత బ్యాంక్‌ రుణం ఇస్తుంది. అప్పుడే ఇల్లు లబ్ధిదారుడి సొంతం అవుతుంది. జిల్లాలో మూడు రకాల 300, 365, 430 ఎస్‌ఎఫ్‌టీలతో ఈ ఇళ్లు ఉన్నాయి. 300 ఎస్‌ఎఫ్‌టీ రకాలు ఉచి తంగా ఇవ్వవలసి ఉంది. ఇవి కూడా లబ్ధిదార్లకు అప్పగించలేదు. 365 ఎస్‌ఎఫ్‌టీకి లబ్ధిదారుడు తన వాటాగా రూ.25 వేలు కడితే 3.15 లక్షలు బ్యాంక్‌ రుణం ఇస్తుంది. 430 ఎస్‌ ఎఫ్‌టీకి లబ్ధిదారుడి వాటాగా రూ.50 వేలు కడితే రూ.3.65 లక్షల బ్యాంక్‌ రుణం ఇస్తుంది. కానీ ప్రస్తుతం జిల్లాలో కేవలం  రాజమహేంద్రవరం పరిధిలోని బొమ్మూరులోని ఇళ్లకే రిజిస్ర్టేషన్‌ మొదలెట్టారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, మెప్మా ఆధ్వర్యం లో ఈ ప్రక్రియ జరుగుతోంది. కానీ బొమ్మూరులో మొత్తం 2,528 ఇళ్లు ఉండగా, ఇప్పటివరకూ 615 ఇళ్లకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ జరిగింది. కానీ వారికి కూడా ఇంకా బ్యాంక్‌ రుణం ఇవ్వలేదు. బ్యాంకులు ఎప్పుడు రుణాలు ఇస్తాయో చెప్పలేం. ఈలోగా అధికారులు మరో పథకం పన్నారు. లబ్ధిదార్లను సొం తంగా డబ్బు కట్టేసుకోమని చెబుతున్నారు. వీరంతా పేదలు.  బ్యాంక్‌ రుణమైతే ఏదోవిధంగా నెమ్మదిగా కడతారు. కానీ ఒకే సారి డబ్బు కట్టుకోమంటే ఎలా కట్టగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొదటిదశలో 23,400 ఇళ్లకుగానూ లబ్ధి దార్లను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటికి కేవలం 615 మందికే రిజిస్ర్టేషన్‌ జరగడంతో మిగతా వారి పరిస్థితేంటనే ఆందోళన మొదలైంది. ఇదంతా ఈ ఏడాదైనా పూర్తవుతుందా, లేక ఎన్ని కల వరకూ తతంగం నడిపిస్తారో మరి. లబ్ధిదారులు మాత్రం ఇళ్లు చూసుకుని ఇది మాదే అని సరిపెట్టుకుంటున్నారు.Read more