విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2022-08-15T06:26:50+05:30 IST

విద్యుదాఘాతంలో సచివా లయ ఉద్యోగి మృతిచెందింది.

విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి

చాగల్లు, ఆగస్టు 14 : విద్యుదాఘాతంలో సచివా లయ ఉద్యోగి మృతిచెందింది. దారవరం గ్రామానికి చెందిన జానకుల లలిత (36) సచివాలయంలో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది. ఆమె భర్త మెకానిక్‌గా పనిచేస్తుండగా అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు.శనివారం సాయంత్రం సచివా లయం నుంచి వచ్చిన తరువాత ఇంటి డాబాపై బట్టలు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది.దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు.ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.సర్పంచ్‌ వద్దుకూరి రవిప్రసాద్‌,సచివాలయ సిబ్బంది పరామర్శించారు.

Read more