వివాహిత అదృశ్యంపై కేసు

ABN , First Publish Date - 2022-02-19T06:33:36+05:30 IST

వివాహిత అదృశ్యంపై కేసు నమోదుచేసినట్టు నగరం ఎస్‌ఐ షేక్‌ జానీబాషా తెలిపారు. గోగన్నమఠం గ్రామానికి చెందిన వివాహిత ఈనెల16న జగ్గన్నపేటలోని రిలయన్స్‌ ట్రెండ్స్‌లోకి భర్తతో కలసి వెళ్లింది.

వివాహిత అదృశ్యంపై కేసు

మామిడికుదురు, ఫిబ్రవరి 18: వివాహిత అదృశ్యంపై కేసు నమోదుచేసినట్టు నగరం ఎస్‌ఐ షేక్‌ జానీబాషా తెలిపారు.  గోగన్నమఠం గ్రామానికి చెందిన వివాహిత ఈనెల16న జగ్గన్నపేటలోని రిలయన్స్‌ ట్రెండ్స్‌లోకి భర్తతో కలసి వెళ్లింది.  ఆమెను షాపు వద్ద వదిలి భర్త బయ టకు వెళ్లాడు. మళ్లీ వచ్చేసరికి ఆమె లేకపోవడంతో  ఫోన్‌ చేయగా 30 నిమిషాల్లో వస్తానని, వేచి ఉండమని ఆమె చెప్పింది. ఎంతసేపటికి రాకపోయేసరికి భర్త ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో చుట్టుపక్కల అంతా వెతికి కనపడకపోవడంతో భర్త నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

 


Read more