వివాహిత మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-02-19T06:34:59+05:30 IST

అదృశ్యమైన వివాహిత.. మృతదేహంగా కనిపించింది.

వివాహిత మృతదేహం లభ్యం

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 18: అదృశ్యమైన వివాహిత.. మృతదేహంగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  భట్నవిల్లి గంగరాజుపే టకు చెందిన పరమట ధనబాబుకు ఈదరపల్లి ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన ఝాన్సీలక్ష్మిని ఇచ్చి 2020లో వివాహం జరిపించారు. రూ.1.09లక్షలు వరకట్నం, ఇతర లాంచనాలు ఇచ్చారు. కొంత కాలం తర్వాత అదనంగా రూ.3లక్షలు కట్నం తేవాలంటూ భర్త ధనబాబు, అత్తింటి కుటుంబ సభ్యులు వేధిం పులు ప్రారంభించారు. దీంతో ఝాన్సీలక్ష్మి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈనెల15న బయటకు వచ్చి సమీపంలో ఉన్న ఈదరపల్లి ప్రధాన పంటకాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె అదృశ్యంపై ఆమె తండ్రి బాబ్జి ఈనెల16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆమె మృతదేహం బోడసకుర్రు వద్ద తేలడంతో తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్‌ శవపంచనామా చేశారు. ఆమె తండ్రి బాబ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ధనబాబు, అత్తింటికి చెందిన పరమట లీలా వతి, పరమట రాజు, పరమట హారిక, కొంబత్తుల వెంకటలక్ష్మిలపై కేసు నమోదుచేసినట్టు  పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌  తెలిపారు.Read more