-
-
Home » Andhra Pradesh » East Godavari » 8th india redcros meeting-NGTS-AndhraPradesh
-
రేపు ఇండియన్ రెడ్‌క్రాస్ కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2022-06-07T06:53:38+05:30 IST
ఇండియన్ రెడ్‌క్రాస్ కోనసీమ జిల్లా బ్రాంచికి ఈనెల8న కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధి కారి సీహెచ్‌సత్తిబాబు తెలిపారు.

అమలాపురం టౌన్, జూన్ 6: ఇండియన్ రెడ్‌క్రాస్ కోనసీమ జిల్లా బ్రాంచికి ఈనెల8న కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధి కారి సీహెచ్‌సత్తిబాబు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా బ్రాంచిలలో ఇండియన్ రెస్‌క్రాస్ సొసైటీ శాఖలను ఏర్పాటుచేసేందుకు జిల్లా అబ్జర్వర్‌గా ఐఆర్‌సీసీ చైర్మన్ వై.శివనాగేంద్రరెడ్డిని పరిశీలకుడిగా నియమిం చారు. జిల్లా మేజిస్ర్టేట్ అయిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఇండియన్ రెడ్‌క్రాస్ కోనసీమ జిల్లా బ్రాంచికి అధ్యక్షుడిగా ఉంటారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను కలెక్టర్ కార్యాల యంలో ఈనెల8వ తేదీ ఉదయం డీఆర్వో ఆధ్వర్యంలో ఎన్నుకునేందుకు నిర్ణ యించారు. రెడ్‌క్రాస్ సంస్థకు సంబంధించి పాట్రాన్స్, వైస్‌పాట్రాన్స్, లైఫ్ మెం బర్లు, లైఫ్‌అసోసియేట్‌తో జరిగే సమావేశానికి సభ్యులు హాజరు కావాలన్నారు.