రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడలకు.. 20, 21న అమలాపురంలో జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2022-09-10T06:43:54+05:30 IST

రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడలకు ఈనెల20,21 తేదీల్లో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్టు జిల్లా ప్రాథికార సంస్థ ముఖ్య క్రీడా శిక్షకులు పీఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడలకు..  20, 21న అమలాపురంలో జిల్లా జట్ల ఎంపిక

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 9: రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడలకు ఈనెల20,21 తేదీల్లో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్టు జిల్లా ప్రాథికార సంస్థ ముఖ్య క్రీడా శిక్షకులు పీఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, కేరమ్స్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, లాన్‌ టెన్నీస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌టెన్సిస్‌ వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బెస్ట్‌ఫిజిక్‌ క్రీడాంశాల్లో జిల్లా జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఈనెల20,21 తేదీల్లో అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తాం. పురుషులు, మహిళలు ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. ఉద్యోగి గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు జిరాక్సు, ఇటీవల తీయించుకున్న పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావాలి.   ఉద్యోగులకు ఎటువంటి టీఏలు, డీఏలు ఇవ్వబడవని స్పష్టం చేశారు.
Read more