రూ.1,309కోట్ల పంచాయతీ నిధులు మళ్లింపు

ABN , First Publish Date - 2022-03-16T06:38:09+05:30 IST

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన రూ.1,309 కోట్ల పంచా యతీ నిధులను జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితా బత్తుల ఆనందరావు ఆరోపించారు.

రూ.1,309కోట్ల పంచాయతీ నిధులు మళ్లింపు

అమలాపురం రూరల్‌, మార్చి 15: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన రూ.1,309 కోట్ల పంచా యతీ నిధులను జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితా బత్తుల ఆనందరావు ఆరోపించారు.  రెడ్డిపల్లిలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కరాటం సూర్యభాస్కరరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన గౌరవ సభలో ఆయన మాట్లాడారు. అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ రాష్ర్టాన్ని అంథకారంలోకి నెట్టేస్తున్నారని జగన్‌ తీరును తీవ్రంగా విమర్శించారు.   మం డల ప్రధాన కార్యదర్శి మంద గెద్దయ్య, మాజీ సర్పంచ్‌లు నడింపల్లి ఉదయబాబు, పరమట శరత్‌బాబు, పిచ్చిక శ్యామ్‌, చింతపట్ల మోహన్‌కుమార్‌, కాశిన బాబి, మండలీక శర్మ, జంపన అర్జున్‌వర్మ, రేలంగి నారాయణరావు, అన్యం సూరి బాబు, కాట్రు శ్రీనుబాబు, నామాడి తారక్‌, గోరు రూపేష్‌, కరాటం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. Read more