12న నన్నయలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-09-10T06:47:49+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈనెల 12న ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు వీసీ మొక్కా జగన్నాథరావు శుక్రవారం తెలిపారు.

12న నన్నయలో  ప్లేస్మెంట్‌ డ్రైవ్‌

దివాన్‌చెరువు, సెప్టెంబరు 9: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈనెల 12న ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు వీసీ మొక్కా జగన్నాథరావు శుక్రవారం తెలిపారు. విశ్వవిద్యాలయం ప్లేస్మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ అసెస్మెంట్‌, కెమిస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ప్రొడక్షన్‌ కెమిస్ట్‌ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విద్యార్థులు ఈ ప్లేస్మెంట్‌డ్రైవ్‌కు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి గల వారు 12వ తేదీ ఉదయం విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో ప్లేస్మెంట్‌ అధికారి బి.జగన్మోహనరెడ్డి, కె.దీప్తిలను సంప్రదించాలని వీసీ కోరారు.

Read more