పది ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-07T06:40:11+05:30 IST

పదో తరగతి ఫలితాలను సోమవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఫలితాల వివరాలను వెల్లడిస్తున్న డీఈవో డి.సుభద్ర

 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 65.83 శాతం ఉత్తీర్ణత

 రాష్ట్రస్థాయిలో 9వ స్థానంతో సరిపెట్టుకున్న జిల్లా 

ఉమ్మడి జిల్లాలో 66,178 మంది పరీక్ష రాయగా 43,567 మంది ఉత్తీర్ణత 

గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ఉత్తీర్ణత శాతం పడిపోయిన ర్యాంకు 

కాకినాడ రూరల్‌, జూన్‌ 6:  పదో తరగతి ఫలితాలను సోమవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన 358 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 66,178మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 43,567మంది ఉత్తీర్ణులయ్యారని, 22,611మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈ వివరాలను కాకినాడలో ని ఎస్‌ఎస్‌ఏ హాల్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఈవో డి.సుభద్ర వెల్లడించారు. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 27 నుంచి మే 9వరకూ నిర్వహించగా మే 13నుంచి ప్రశ్నాపత్రాలను మూ ల్యాంకనం చేశారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత పదోతరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటించారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషే ధం విధించిన విషయం తెలిసిందే. పరీక్షా ఫలితాలను ఠీఠీఠీ.ఛట్ఛ.్చఞ. జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

డివిజన్లవారీగా ఫలితాలు ఇలా.. 

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 9వస్థానంలో నిలవగా మొత్తం 65.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 32,310మంది విద్యార్థులు మొదటి డివిజన్‌లోనూ, 8074మంది రెండో డివిజన్‌లోనూ, 3183మంది మూడో డివిజన్‌లోను ఉత్తీర్ణులు కాగా మొత్తం 43,567మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాల వారీగా ఫలితాలు ఇలా.. 

 కాకినాడ జిల్లానుంచి 27,072మంది విద్యార్థులు 144 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకాగా 17,841మంది ఉత్తీర్ణులు కాగా 9231మంది ఫెయిల్‌ అయ్యారు. 65.90 ఉత్తీర్ణతశాతం నమోదైంది.

తూర్పుగోదావరి జిల్లాలో 14,950మంది 79 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకాగా 9,367మంది ఉత్తీర్ణులుకాగా 5,583మంది ఫెయిల్‌ అయ్యారు. 62.66శాతం ఉత్తీర్ణులయ్యారు. 

కోనసీమ జిల్లాలో 19,760మంది విద్యార్థులు 112 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకాగా 13,615మంది ఉత్తీర్ణులు కాగా 6,145మంది ఫెయిల్‌ అయ్యారు. 68.90ఉత్తీర్ణత శాతం నమోదైంది.

 ఏఎస్‌ఆర్‌ జిల్లాలో 3,806 మంది విద్యార్థులు 23 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలకు హాజరుకాగా 2,296మంది ఉత్తీర్ణులు కాగా 1510 మంది ఫెయిల్‌ అయ్యారు. 60.33ఉత్తీర్ణత శాతం నమోదైంది. 

 యానాంలో 590మంది విద్యార్థులు హాజరుకాగా 448మంది ఉత్తీ ర్ణులు కాగా 142మంది తప్పారు. 75.93 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 

మొత్తం పరీక్షలు రాసిన 66,178మంది విద్యార్థుల్లో 32,961మంది బాలురు, 33,217మంది బాలికలు ఉన్నారు. వారిలో 43,567మంది ఉత్తీర్ణులు కాగా 20,585మంది బాలురు, 22,982మంది బాలికలు పాసయ్యారు. జూలై 6 నుంచి 15 వరకూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.

పదిలో ప్రభుత్వం ఫెయిల్‌

20ఏళ్ల తర్వాత ఇవే ఘోరమైన ఫలితాలు

 దీనికి అనేక విఫలయత్నాలే కారణం 

 రాజమహేంద్రవరం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : :పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వమే ఫెయిలైనట్టు విమర్శలు వస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీనికి ప్రభుత్వ విఫలయత్నా లే కారణమనే విమర్శలు విద్యావ్యవస్థలో వినిపిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల  తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. పరీక్షల సమయంలో నే కొంతమంది విద్యార్థులు వివిధ  కారణాల వల్ల పరీక్షలు రాయలేకపోయారు. కానీ పరీక్షలు రాసిన వారిలో ఇంతమంది ఫెయిల్‌ అవ్వడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఏనాడూ ఇంత దారుణమైన ఫలితాలు చూడలేదని ఉపాధ్యాయులు, పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు చూపిస్తున్నారు. కరోనావల్ల రెం డేళ్ల పాటు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థు లు పాసు చేశారు. 8,9 తరగతుల విద్యార్థులను  చదువులు లేకుండానే పదో తరగతికి  ప్రమోట్‌ చేశారు. కానీ వీళ్లకు 8వ, 9వ తరగతుల పాఠ్యాంశాలు ఏమీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ తగ్గించమని ఉపాధ్యాయులు, వారి సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం ప్రిస్టేజీకి పోయింది. సిలబస్‌ రుద్దేసింది. కానీ తగిన విఽధం గా పాఠాలు చెప్పే పరిస్థితులు లేవు. కరోనా వల్ల చాలా మంది విద్యార్థులు ఎక్కువ రోజులు పాఠశాలలకు రాలేదు. కరోనా భయంతో ఉపాధ్యాయులు కూడా ఎక్కువరోజులు విద్యార్థులను దగ్గరకు రానిచ్చేవారు కాదు. వారి పుస్తకాలు ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే చాలామంది ఉపా ధ్యాయులు కరోనావల్ల మృతి చెందడంతో వీరికి భయంపట్టుకుంది. ఇక ఆన్‌లైన్‌ క్లాసులు పూర్తిగా విఫలమయ్యాయి. టీవీల ద్వారా పాఠాలు చెప్పించామంటున్నారు. వాస్తవానికి టీవీలు ఎంత మం ది రెగ్యులర్‌గా చూస్తున్నారు. సిటీ కేబుల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో చాలామందికి కనెక్షన్లు పెట్టించుకోలేదు. పైగా అందరికీ టీవీలు ఉండవు. ఉంటే కరెంట్‌ ఉండదు. ఈ పరిస్థితులలో ఎక్కు వ మ ంది టీవీ క్లాసులు వినలేదు. విన్నా ఎంత వరకూ అర్ధం చేసుకుంటారు. జ్యూమ్‌ పాఠాలు కూడా చెప్పించారు. కానీ ఎంతమంది విద్యార్థులు మం చి ఫోన్లు ఉంటాయి.  అవికూడా విఫలమయ్యా యి. ఈ విద్యాసంవత్సరంలో కూడా  కొంత కరో నా ఉండడంతో ఈసారి కూడా పరీక్షలు లే కుండానే ఉత్తీర్ణులను చేస్తారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావించారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఈసారి టెన్త్‌ పరీక్షలలో పూర్తిగా విఫలమైందని, అందుకు ఎక్కువమంది విద్యార్థు లు ఫెయిల్‌ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. 

కేజీబీవీ టాపర్‌గా నల్లమల్లి తేజస్విని

శంఖవరం, జూన్‌ 6 : పది ఫలితాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేజీబీవీ టాఫర్‌గా (555) రౌతులపూడి మండలం బీబీ పట్నం గ్రామానికి చెందిన నల్లమ ల్లి తేజస్విని నిలిచింది. శంఖవరం కేజీబీవీలో పది చదివింది. ఫలితాల్లో కేజీబీవీ  పాఠశాలల టాఫర్‌గా నిలవడంపై ఎమ్మెల్యే పర్వతప్రసాద్‌, ఎంపీపీ పర్వత రాజుబాబు హర్షం వ్యక్తం చేశారు.  వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న తేజస్వీని తల్లిదండ్రులు నల్లమల్లి వరహాలు, వర లక్ష్మిలు ఆనందాన్ని వ్యక్తంచేశారు. మా కష్టానికి ప్రతిఫలం చూపిందని అనందపడ్డారు. మా అమ్మాయికి విద్యాబుద్దులు నేర్పిన గురువులకు రుణపడి ఉంటామన్నారు.

జూలై 6 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

కాకినాడ రూరల్‌, జూన్‌ 6: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూలై 6 నుంచి 15 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో సుభద్ర తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 20వ తేదీవరకూ రూ.50 ఆల స్య రుసుముతో ఈనెల 21 నుంచి పరీక్ష జరిగే ముందు తేదీ వరకూ చెల్లించవచ్చన్నారు. రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఒక సబ్జెక్టుకు రూ.500 రుసుము చెల్లించాలని ఫలితాలు వెలువడిన 14 రోజులలోపు చలానా తీసి ప్రభుత్వ సంచాలకులు విజయవాడవారికి పంపించాలన్నారు. రీ వెరిఫికేషన్‌కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఒక సబ్జెక్టుకు రూ.1000 రుసుమును ఫలితాలు వెలువడిన 14రోజులలోపు చలానాతీసి  ప్రధానోపాధ్యాయుల ద్వారా కాకినాడ పూర్వపు డీఈ వో కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు ఠీఠీఠీ.ఛట్ఛ. ్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

నిలిచిన పాపికొండల విహారయాత్ర                                 

వరరామచంద్రాపురం, జూన్‌ 6:  వాతావరణం అనుకూ లించక పోవడంతో పేరంటాలపల్లి, పాపికొండల విహార యాత్ర నిలిపివేశారు. తుఫాను కారణంగా గాలి దుమారం, వర్షాం నేపఽథ్యంలో సోమవారం, మంగళవారం విహారయా త్ర బోట్లు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బోట్లు నిలిపివేసినట్లు బోట్‌ యూనియన్‌ సభ్యులు తెలి పారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన పర్యాటకు లు చేసేది ఏమీలేక వెనుతిరిగి వెళ్లిపోయారు.     Read more