Sharnnavaratri celebrations: ఇంద్రకీలాద్రిపై అర్చకుల సరికొత్త‌ ప్రయోగం... భక్తుల హర్షం

ABN , First Publish Date - 2022-09-26T18:45:56+05:30 IST

దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై సరికొత్త‌ ప్రయోగానికి అర్చకులు నాందిపలికారు.

Sharnnavaratri celebrations: ఇంద్రకీలాద్రిపై అర్చకుల సరికొత్త‌ ప్రయోగం... భక్తుల హర్షం

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవా(Dussera sharannavaratri celebrations)ల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై సరికొత్త‌ ప్రయోగానికి అర్చకులు నాందిపలికారు. అమ్మవారి అంతరాలయంలో ఏ అలంకారం ఉంటుందో ఆ అలంకారాన్నే కుంకుమ పూజ భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తొలిరోజు ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో  దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. అంతరాలయంలో ఉన్న అలంకరణే కుంకుమ పూజ నిర్వహించే ప్రాంతంలో అలంకరణ చేసి భక్తులకు మహాద్భాగ్యాన్ని  అర్చకులు కల్పించారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారణ చూస్తూ భక్తులు కుంకుమ పూజ చేస్తున్నారు. గతంలో ఉత్సవ మూర్తికి కుంకుమ పూజ నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అమ్మవారికే నేరుగా పూజ చేసే అవకాశం కలగడంతో భక్తులు గొప్ప అదృష్టంగా భావిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. పది రోజుల పాటు పది అలంకారాలకు అమ్మవారి అలంకరణే మహామండపం కుంకుమ పూజ వద్ద చేపట్టి భక్తులకు అమ్మవారి అనుగ్రహాన్ని కల్పిస్తామని అర్చకులు చెబుతున్నారు. అర్చకుల నిర్ణయాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు.

Updated Date - 2022-09-26T18:45:56+05:30 IST