ఇంద్రకీలాద్రిపై తుది దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-04T13:37:46+05:30 IST

ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై తుది దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకిలాద్రిపై దసరా  ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు  భక్తులు బారులు తీరారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. మహిషాసుర మర్ధనిని  దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి , సాత్విక భావం ఏర్పడుతుంది నమ్మకం. సర్వదోషాలు పటాపంచలై ధైర్య , స్థైర్య , విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి  భక్తులు, భవానీల తాకిడి  పెరిగింది. 

Updated Date - 2022-10-04T13:37:46+05:30 IST