దుర్గమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి

ABN , First Publish Date - 2022-10-05T08:26:01+05:30 IST

దుర్గమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి

దుర్గమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి

ప్రజలకు గవర్నర్‌, టీడీపీ దసరా శుభాకాంక్షలు

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితర ప్రముఖులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నమై వెలగాలని వారు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బుధవారం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  


Read more