పోలవరం మట్టి మళ్లీ మూలలంకలో డంపింగ్‌

ABN , First Publish Date - 2022-06-11T08:11:49+05:30 IST

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశాలను బేఖాతరు చేసి మూలలంకలో మళ్లీ మట్టి డంపింగ్‌ చేయడం సరికాదని ఆర్థికవేత్త

పోలవరం మట్టి మళ్లీ మూలలంకలో డంపింగ్‌

పీసీబీ ఆదేశాలు బేఖాతరు.. పెంటపాటి పుల్లారావు ఆక్షేపణ


పోలవరం, జూన్‌ 10: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశాలను బేఖాతరు చేసి మూలలంకలో మళ్లీ మట్టి డంపింగ్‌ చేయడం సరికాదని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టు ప్రాంతం నుంచి పది కోట్ల టన్నుల మట్టిని మూలలంకలో డంపింగ్‌ చేయడం వల్ల పోలవరం గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘15 వేల ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతుంది. ఐదు వేల మంది రైతులు ఉపాధి కోల్పోతారు. రానున్న వర్షాకాలం సీజన్‌లో మూలలంక మట్టి కడమ్మ కాలువలోకి జారడం వల్ల కాలువ పూడుకు పోయి కొండ వాగుల నీరు, వర్షాల నీరు నిలిచి పోలవరం గ్రామం, పంట పొలాలు నీటమునిగే అవకాశాలు ఉన్నాయని 2016లో పిటిషన్‌ దాఖలు చేశాం. 2018 డిసెంబరు 26న పీసీబీ, ఎన్‌జీటీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, ఇరిగేషన్‌ అధికారులు పరిశీలన అనంతరం డంపింగ్‌ నిలిపి వేయాలని పీసీబీ ఆదేశించింది. కానీ దానికి విరుద్ధంగా నేడు పోలవరం ప్రాజెక్టు అధికారులు మూలలంకలో మళ్లీ డంపింగ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పీసీబీ, పీపీఏ స్పందించి డంపింగ్‌ నిలిపివేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read more