బకాయిపెడితే ఊరుకోం

ABN , First Publish Date - 2022-09-24T10:22:39+05:30 IST

బకాయిపెడితే ఊరుకోం

బకాయిపెడితే ఊరుకోం

లేట్‌పే కింద డిస్కమ్‌లపై వేటువేస్తాం

డిస్కమ్‌లకు కేంద్రప్రభుత్వం మెమో


అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లపై కేంద్రప్రభుత్వం కొరడా ఝుళిపించింది. బిల్లులను విద్యుత్తు సరఫరాదారులకు ఎప్పటికప్పుడు ఒప్పందం మేరకు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. కరెంటు సరఫరా చేసినట్లుగా ఇన్వాయిస్‌ పంపిన పది రోజుల్లోనే చెల్లింపులు జరపాలని డిస్కమ్‌లకు కేంద్రం స్పష్టంచేసింది. ఈ కొనుగోళ్లు .. ఇన్వాయి్‌సలకు సంబంధించిన సమాచారం ఐదు రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ప్రాప్తి’ పోర్టల్‌లో పెట్టాలని స్పష్టంచేసింది. బకాయిల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటే ‘లేట్‌ పే సర్‌చార్జి’ మార్గదర్శకాల మేరకు డిస్కమ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యుత్తు సరఫరాదారులతో చేసుకున్న కొనుగోలు ఒప్పందాల మేరకు బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. ఒకసారి కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాక వాటిని అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఒప్పుకో బోమని హెచ్చరించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న డిస్కమ్‌లకు కేంద్రం మెమోను జారీ చేసింది. 


Read more