ఆ నోటీసులపై చర్యలు తీసుకోవద్దు: పోతిన మహేష్‌

ABN , First Publish Date - 2022-10-07T03:29:02+05:30 IST

రైల్వే డీఆర్‌ఎంని కలిసిన జనసేన నేత పోతిన మహేష్ గురువారం కలిశారు.

ఆ నోటీసులపై చర్యలు తీసుకోవద్దు: పోతిన మహేష్‌

విజయవాడ: రైల్వే డీఆర్‌ఎంని జనసేన నేత పోతిన మహేష్ గురువారం కలిశారు. పాత రాజరాజేశ్వరిపేట వాసుల ఇళ్ల పట్టాల సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత రాజరాజేశ్వరిపేట వాసులకు ఇచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. దాదాపు 40 ఏళ్లుగా  వారు అక్కడే నివాసముంటున్నారని, వారికి తగిన న్యాయం జరిగేంతవరకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవద్దని పోతిన మహేష్‌ కోరారు.

Read more