-
-
Home » Andhra Pradesh » Do you care if people are dying-NGTS-AndhraPradesh
-
జనం చస్తున్నా.. పట్టించుకోరా?
ABN , First Publish Date - 2022-07-18T08:42:41+05:30 IST
జనం చస్తున్నా.. పట్టించుకోరా?

రోడ్లపై గొంతెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు
ఊళ్లోకి వెళితే జనం తిడుతున్నారు
నెల్లూరు జడ్పీ సమావేశంలో నేతల గోడు
మిస్టర్ సీఎం..
వినపడుతోందా?
కనపడుతోందా?
గుంతలతో ఉన్న నందవరం-ఉదయగిరి రోడ్డు. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని, నలుగురికి కాళ్లు విరిగాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘కలిగిరి-సంగం రోడ్డును చూశారా... ఎంత దారుణంగా ఉందో.. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు వ్యక్తి చనిపోయారు. నందవరం-ఉదయగిరి రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలున్నాయి. అధికారులకు కనిపించలేదా? ఈ రోడ్డుపై ఇటీవలే ముగ్గురు చనిపోయారు. రోడ్లు దెబ్బతినడంతో కొన్ని ఊర్లకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. టెండర్లు పిలిచినా పనులెందుకు చేయడం లేదు’... ఇదీ ఆదివారం జరిగిన నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీల గోడు. హసనాపురం రోడ్డు దారుణంగా ఉంటే చూస్తూ ఉంటా రా అంటూ కలిగిరి జడ్పీటీసీ మాల్యాద్రిరెడ్డి నిలదీశారు. ‘బ్రాహ్మణపల్లి-కృష్ణాపురం రోడ్డు బాగా దెబ్బతింది. మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. ప్రజలు తిడుతున్నారు’ మర్రిపాడు జడ్పీటీసీ ఎం.సుధాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నందవరం-ఉదయగిరి రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు మూడు సార్లు చీఫ్ ఇంజనీర్‌ను కలిసినా పట్టించుకోలేదన్నారు. కొన్ని ఊర్లకు వేళ్లేందుకు రోడ్లు సరిగా లేవని, టెండర్లు పిలిచినా పనులెందుకు మొదలుకావడం లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు-పొదలకూరు-సైదాపు రం రోడ్ల పనులు ప్రారంభించాలని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కోరారు. కావలి మండలంలో ఏఏబీ కింద మంజూరైన 2 రోడ్లు ఇప్పటి వరకు మొదలు కాలేదని, టెండర్లు పిలిచినా పనులెందుకు చేయ డం లేదని ఎమ్మెల్యే నిలదీశారు. మంత్రి కాకాణి స్పందిస్తూ పనులు చే యని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల(ఏఎంసీ) నిధులతో చేపట్టిన పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు వేసేలా ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు చొరవ తీసుకోవాలని, తాను బిల్లులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నెలలు గడుస్తున్నా రైతులకు డబ్బులు ఇవ్వలేదని కావలి ఎమ్మెల్యేతోపాటు జడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.