ఏబీవీ ధిక్కరణ వ్యాజ్యం కొట్టివేత

ABN , First Publish Date - 2022-11-30T04:04:00+05:30 IST

తనను సస్పెండ్‌ చేసిన కాలానికి జీతభత్యాల చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభు త్వం

ఏబీవీ ధిక్కరణ వ్యాజ్యం కొట్టివేత

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తనను సస్పెండ్‌ చేసిన కాలానికి జీతభత్యాల చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేయడం లేదని తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీ ర్‌ శర్మపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో సీఎస్‌ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకి రాదని అభిప్రాయపడింది. తర్వాత కాలం లో సీఎస్‌ చర్యలు ధిక్కరణ కిందకు వస్తాయని భావిస్తే కోర్టును ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిచ్చింది. ప్రస్తుత తీర్పు పిటిషన్‌ వేసుకునేందుకు అవరోధం కాబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎస్‌. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘాపరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేసింది.

Updated Date - 2022-11-30T04:04:00+05:30 IST

Read more