ఎప్పుడూ లేనంత ఘోర వైఫల్యం: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-06-08T00:10:44+05:30 IST

విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

ఎప్పుడూ లేనంత ఘోర వైఫల్యం: ధూళిపాళ్ల

అమరావతి: విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. టెన్త్ ఫలితాల్లో పదేళ్లలో ఎప్పుడూ లేనంత ఘోర వైఫల్యం చెందిందన్నారు. కొవిడ్ ఉన్నా ఇతర రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలు పెంచారని చెప్పారు. ఏపీలో ఉపాధ్యాయులను వైన్‌షాప్‌ల దగ్గర నిలబెట్టారని గుర్తుచేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని ఆయన ఆరోపించారు. ఇంగ్లీష్‌ మీడియంలో చేరాలని విద్యార్థులను బలవంతపెడుతున్నారని పేర్కొన్నారు. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేయడం బాధాకరమన్నారు. 

Read more