కర్నూలుకు చెందిన ఒక కేసులో కోర్టుకు హాజరైన DGP

ABN , First Publish Date - 2022-09-30T17:17:10+05:30 IST

కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendanath Reddy) కోర్టుకు హాజరయ్యారు.

కర్నూలుకు చెందిన ఒక కేసులో కోర్టుకు హాజరైన DGP

కర్నూలు : కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendanath Reddy) కోర్టుకు హాజరయ్యారు. పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department), పోలీసులు నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం వాహనాలు స్వాధీనం చేసుకోవడంపై మిల్లు యజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించకపోవడంపై హైకోర్టు గత వాయిదా సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వాయిదా సందర్భంగా డీజీపీని కోర్టుకు రావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు డీజీపీ కోర్టుకు హాజరయ్యారు.

Read more