బాసరకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-10-03T09:43:33+05:30 IST

ర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం పర్వదినాన్ని

బాసరకు పోటెత్తిన భక్తులు

అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌ పట్టు వస్త్రాలు


బాసర, అక్టోబరు 2: నిర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more